The death of children (Telugu)
A translation of Richard Berengarten’s poem ‘The death of children’
by Nellutla Venugopal
The death of children (Telugu)
చిన్నారి పిల్లల మరణం
రిచర్డ్ బెరెన్ గార్టెన్
చిన్నారి పిల్లల మరణమే ఎక్కువ గాయపరుస్తుంది
ప్రకృతినీ న్యాయాన్నీ. ఎందుకని అడగడం అనవసరం.
న్యాయమంటే ఏమిటి, ఏ ఒక్కరికీ అర్థం కాదు.
ఏ శిక్షతో ఎప్పటికి మారిపోయేనిదంతా?
కారణం లేదు, సాకు లేదు, నెపం లేదు.
చిన్నారి పిల్లల మరణమే ఎక్కువ గాయపరుస్తుంది.
వాదనలు గుప్పించే వారెవరైనా నటిస్తుంటారు
విధి లిఖితాన్నిచదువుతున్నట్టు. దాని మీద ఒట్టు పెట్టుకున్నా
న్యాయమంటే ఏమిటి, ఏ ఒక్కరికీ అర్థం కాదు.
అదృష్టమో అవకాశమో అల్లుకునేదెట్లా. తమ ఉద్దేశాలే
సకారణాలంటూ సమర్థించుకునేవాళ్లు చెప్పేది పచ్చి అబద్ధం.
చిన్నారి పిల్లల మరణమే ఎక్కువ గాయపరుస్తుంది.
మృత్యువుకు ఇన్నిన్ని పంటలు కోసుకుపోయే అర్హత లేదని
ఇంకా జీవితమే చూడని చిన్నారుల తల్లిదండ్రుల ఘోష.
న్యాయమంటే ఏమిటి, ఏ ఒక్కరికీ అర్థం కాదు.
అందుకే మరి ఓదార్చండి, ధైర్యమివ్వండి. అపరిచితులారా, మిత్రులారా,
చిన్నారులు మరణించేవేళ అందరమూ తల్లిదండ్రులమే కాదా?
న్యాయమంటే ఏమిటి, ఏ ఒక్కరికీ అర్థం కాదు.
చిన్నారి పిల్లల మరణమే ఎక్కువ గాయపరుస్తుంది.
Translated by
Nellutla Venugopal